అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ పెద్దల సమావేశం | Tollywood Film Industry Meeting At Annapoorna Studios | Sakshi
Sakshi News home page

Apr 21 2018 9:33 AM | Updated on Mar 22 2019 5:33 PM

Tollywood Film Industry Meeting At Annapoorna Studios - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పవన్‌ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకోవటం. వ్యాఖ్యల వెనుక తానున్నానంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. శుక్రవారం ఉదయం పవన్‌ సహా మెగా ఫ్యామిలీ హీరోలు ఫిలిం ఛాంబర్‌కు రావటంతో అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని వారికి మద్ధతు తెలిపారు.

దీంతో వెంటనే స‍్పందించిన ఫిలిం ఛాంబర్‌ ఈ రోజు (శనివారం) 10 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ (మా), నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని 24 శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని భావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ కూడా సినీ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement