అతను పడటం లేదు

Tiger Shroff the go to person for Disha Patani for professional advice - Sakshi

అబ్బాయిలు పడగొట్టాలి, అమ్మాయిలు పడిపోవాలి.  అది ఆనవాయితి అని ఓ సినీ కవి చెప్పాడు. కానీ దీనికి విరుద్ధంగా నేనెంత పడగొట్టినా టైగర్‌ నాకింకా పడటం లే దంటున్నారు దిశా పటానీ. బాలీవుడ్‌లో యాక్టర్స్‌ టైగర్‌ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ విషయంపై ఇద్దరూ మౌనవ్రతం వహించారు. ఇటీవల కొంచెం మాట్లాడుతున్నారు. టైగర్‌తో ఉన్న అనుబంధం గురించి దిశా పటానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘నీ కోసం, జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నాను, బ్యాక్‌ ఫ్లిప్‌ చేశాను అని చెప్పినప్పటికి తను ఇంప్రెస్‌ కావడం లేదు. ఇంకేం చేయాలి? తను చాలా స్లో. మేం కేవలం ఫ్రెండ్స్‌లా కాకుండా మా రిలేషన్‌షిప్‌ పెరగాలని కోరుకుంటున్నాను. నా శక్తి మేరకు ఇంప్రెస్‌ చేస్తున్నాను, తను మాత్రం పడటం లేదు’’ అని పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే దిశా కీలక పాత్రలో నటించిన సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’ జూన్‌ 5న రిలీజ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top