అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్‌ | Tiger Shroff Baaghi 3 Movie Trailer Released | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఫీట్లతో అదిరిపోయిన భాగీ-3 ట్రైలర్‌

Feb 6 2020 11:40 AM | Updated on Feb 6 2020 12:29 PM

Tiger Shroff Baaghi 3 Movie Trailer Released - Sakshi

ఉగ్రమూక ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) దురాగతాలతో.. నిరంతరం బాంబుల వర్షంతో మోతమోగే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దేశంలో టెర్రరిస్టుల చేతికి చిక్కిన తన సోదరుడిని కాపాడుకునేందుకు హీరో చేసిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా భాగీ 3. బాలీవుడ్‌ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కెరీర్‌ను మలుపుతిప్పిన భాగీ ప్రాంఛైజీలో వస్తున్న మూడో సినిమా ఇది. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, టైగర్‌ ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. భాగీ సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన శ్రద్ధా కపూర్‌.. ఈ సినిమాలోనూ టైగర్‌తో జోడీతో కట్టారు. 

కాగా అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. దాదాపు 4 నిమిషాల నిడివి గల అద్భుతమైన యాక్షన్‌ ఫీట్లతో అదిరిపోయింది. సోదరుడిని కాపాడుకునేందుకు హీరో ఉగ్రమూకతో తలపడే తీరు వన్‌ మ్యాన్‌ షోను తలపించింది. ఇక ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement