‘థగ్స్‌’కు అంత సీన్‌ లేదు.. బాహుబలి రికార్డ్స్‌ సేఫ్‌ | Thugs Of Hindostan First Day Collection Record | Sakshi
Sakshi News home page

Nov 10 2018 10:08 AM | Updated on Nov 10 2018 6:56 PM

Thugs Of Hindostan First Day Collection Record - Sakshi

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ భారీ చిత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌. బాహుబలి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇండియాలో ఆ సినిమా రికార్డ్‌ లను దాటే హిట్ ఇవ్వాలని బాలీవుడ్ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కలలు కంటున్నాడు. దంగల్ సినిమాతో వసూళ్ల విషయంలో బాహుబలిని దాటినా భారత మార్కెట్‌లో మాత్రం బాహుబలిని రికార్డ్‌లను దాటలేకపోయాడు.

దీంతో థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌తో బాహుబలి రికార్డ్‌లను బద్ధలు కొట్టొచ్చన్న ఆశతో ఉన్నాడు ఆమిర్‌. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్‌ వచ్చింది. దీంతో బాహుబలి రికార్డ్‌లకు ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని కన్ఫామ్‌ అయిపోయింది. అయితే తొలి రోజు రికార్డ్ విషయంలో మాత్రం థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ బాహుబలిని దాటేసింది.

ఈ సినిమా తొలి రోజు దాదాపు 52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. బాహుబలి 2 తొలి రోజు 40.73 కోట్ల వసూళ్లు సాధించింది. సినిమా టాక్‌తో డీలా పడిపోయినా థగ్స్‌ ఆఫ్ హిందుస్థాన్‌ టీంకు ఇది కాస్త ఊరట నిచ్చే వార్తే అని భావిస్తున్నారు విశ్లేషకులు.

Advertisement
 
Advertisement
Advertisement