ఉత్కంఠ కలిగించే ప్రేమకథ | Thrilling Love story | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ కలిగించే ప్రేమకథ

Feb 6 2015 10:56 PM | Updated on Sep 2 2017 8:54 PM

ఉత్కంఠ కలిగించే ప్రేమకథ

ఉత్కంఠ కలిగించే ప్రేమకథ

‘‘ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం’’ అని దర్శకుడు జె. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

‘‘ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ  ప్రేక్షకులను థ్రిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం’’ అని దర్శకుడు జె. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. శివ, మేఘశ్రీ జంటగా జె. ప్రభాకర్‌రెడ్డి, కొడాలి సుబ్బారావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శక నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు.

నిర్మాత సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వ హించారు. హీరో శివ మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ‘జగన్’ కమర్షియల్ హిట్టయింది. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’అని తెలిపారు.ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, సంగీతం: స్వరాజ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: వి. రవికుమార్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement