తోట బావిలో... | Thota Bavi Movie Teaser Launched By N Shankar | Sakshi
Sakshi News home page

తోట బావిలో...

Mar 15 2020 5:58 AM | Updated on Mar 15 2020 5:58 AM

Thota Bavi Movie Teaser Launched By N Shankar - Sakshi

అభినేష్, అంజి, ఎన్‌.శంకర్, చిన్న స్వామి

యాంకర్‌ రవి, గౌతమి జంటగా నటిస్తున్న చిత్రం ‘తోట బావి’. గద్వాల్‌ కింగ్‌ సమర్పణలో ఆలూర్‌ ప్రకాశ్‌గౌడ్‌ నిర్మించారు. అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు ఎన్‌.శంకర్‌ విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘రవిని చాలాకాలంగా టీవీలో చూస్తున్నాను. మంచి టైమింగ్‌ ఉన్న నటుడు’’ అన్నారు. ‘‘రవి ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు అంజి దేవండ్ల. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో మా దర్శకుడు సినిమాను ఇంట్రస్టింగ్‌గా తీశారు. మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు’’ అన్నారు ప్రకాష్‌ గౌడ్‌. ఈ చిత్రానికి దౌలు, చిన్నస్వామి, అభిషేక్‌ .బి సహనిర్మాతలు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement