కొత్త డైరెక్టర్‌ చేశాడా అని పెదనాన్న షాక్‌ అయ్యారు– వరుణ్‌ తేజ్‌

Tholi Prema Movie Success Meet  - Sakshi

‘‘లవ్‌ స్టోరీకు కావల్సింది కెమిస్ట్రీ అని అప్పుడు ఆ ‘తొలిప్రేమ’, ఇప్పుడు ఈ ‘తొలిప్రేమ’ ప్రూవ్‌ చేశాయి. వరుణ్, రాశీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. వరుణ్‌ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘ఫిదా’ స్టార్ట్‌ అయ్యే టైమ్‌లో వెంకీ నా దగ్గరకు వచ్చి ‘సార్‌ నేనీ సినిమా బయటవాళ్లతో చేసుకుంటాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను.

సినిమా అయిపోయాక బాపినీడు సినిమాను తీసుకొచ్చి మళ్లీ నా చేతుల్లో పెట్టాడు. వరుణ్‌ తేజ్‌ లుక్స్‌ బాగున్నాయి. ‘ఫిదా, తొలిప్రేమ’ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ సాధించాడు. నెక్ట్స్‌ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాలి. రాశీ బాగా చేసింది’’ అన్నారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ కథను నమ్మిన ‘దిల్‌’ రాజు గారికి థ్యాంక్స్‌. మీరు లేకపోతే సినిమా స్టార్ట్‌ అవ్వకపోయేది. నా మీద, వెంకీ మీద నమ్మకం ఉంచారు. వెంకీకి సినిమా మీద ఉన్న ప్రేమ, మేకింగ్‌లో ఉన్న కన్విక్షన్‌ సూపర్బ్‌.

పెదనాన్న (చిరంజీవి) ఈ సినిమాను చూసి, డెబ్యూ డైరెక్టర్‌  ఈ సినిమా తీశాడా అని షాక్‌ అయ్యారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నాకు ఫీమేల్‌ ఫ్యాన్స్‌ పెరుగుతారు అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ రాసిన వెంకీకి థ్యాంక్స్‌’’ అన్నారు రాశీ ఖన్నా.  వెంకీ మాట్లాడుతూ – ‘‘రాశీని అనుకున్నప్పుడు భయం ఉండేది కానీ చాలా బాగా చేసింది. ఈ కథను వరుణ్‌ బిలీవ్‌ చేయటం వల్లే ఈ సినిమా ప్రాణం పోసుకుంది. ఈ సినిమాకు రెండు పిల్లర్స్‌ జార్జ్, తమన్‌. లిరిక్స్‌ రాసిన శ్రీ మణిగారికి థ్యాంక్స్‌.

ప్రసాద్‌గారిని సార్‌ అని పిలుస్తాను కానీ నాకు ఫ్రెండ్‌ లాంటి వారు. బాపినీడు మంచి ఫ్రెండ్‌’’ అన్నారు.  ‘‘ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా వరుణ్‌ తేజ్‌కు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను నమ్మి చేశాడు. టెక్నీషియన్స్‌ అందరూ చాలా బాగా చేశారు’’ అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. ‘‘నేను ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేసిన హీరోస్‌ అందరితో బ్లాక్‌బాస్టర్స్‌ కొట్టాను ‘బృందావనం, కిక్, దూకుడు’..  ఈ సినిమా స్టార్ట్‌ అప్పుడు ఇదే అనుకున్నాను. అలాగే సూపర్‌ హిట్‌ అయింది’’ అన్నారు తమన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top