వరుణ్.. వరుసగా రెండోసారి..! | Tholi Prema Joins Million Dollar Club | Sakshi
Sakshi News home page

Feb 24 2018 12:31 PM | Updated on Feb 24 2018 6:09 PM

Tholi Prema Movie Poster - Sakshi

‘తొలిప్రేమ’ మూవీ స్టిల్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌ సీస్‌లోనూ భారీ వసూళ్లు సాదిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ తరువాత ఒక్క అ! తప్ప ఓవర్‌ సీస్‌ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాలేవి రిలీజ్‌ కాకపోవటంతో ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో స్థానం దక్కించుకుంది.

ఫిదా సినిమాతో ఓవర్‌సీస్‌లో తొలిసారిగా మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో జాయిన్‌ అయిన వరుణ్ తేజ్‌, తొలిప్రేమతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్‌ చేశాడు. వరుణ్‌ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నాడట.

Advertisement
 
Advertisement
Advertisement