భలే.. భలే...వినోదం! | The Regular Shooting Of The Film Bhale Bhale Magadivoy | Sakshi
Sakshi News home page

భలే.. భలే...వినోదం!

Mar 2 2015 11:57 PM | Updated on Sep 2 2017 10:11 PM

భలే.. భలే...వినోదం!

భలే.. భలే...వినోదం!

చక్కటి వినోదం ఉన్న మంచి ప్రేమకథా చిత్రమిది. కచ్చితంగా అందరూ హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి చెప్పారు.

‘‘చక్కటి వినోదం ఉన్న మంచి ప్రేమకథా చిత్రమిది. కచ్చితంగా అందరూ హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి చెప్పారు. ఆయన దర్శకత్వంలో నాని, లావణ్యా త్రిపాఠీ జంటగా జీఏ2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
 
 ముహూర్త దృశ్యానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ -‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందించ నున్నారు. శరవేగంగా సినిమా పూర్తి చేసి, ఆగస్టులో విడుదల చేస్తాం’’అని తెలిపారు. నరేష్, స్వప్నమాధురి, సితార, ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిజార్ షఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement