ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు | The Jungle Book debuts with over $100 mn in North America | Sakshi
Sakshi News home page

ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు

Apr 18 2016 1:37 PM | Updated on Jul 6 2019 12:38 PM

ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు - Sakshi

ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు

హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది.

ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. భారత్ కంటే ఆలస్యంగా నార్త్ అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక భారత్లో ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

ఈ సినిమా భారత్ సహా 15 దేశాల్లో 8వ తేదీ విడుదల కాగా, నార్త్ అమెరికాలో 15న విడుదలైంది. హాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు విశ్లేషకుల ప్రశంసలు, హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. యువకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీని..   జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement