
డాన్‌తో ప్రేమ
అల్లరి పిడుగు, మల్లీశ్వరి చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించిన కత్రినా కైఫ్ మరోసారి ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్నారు.
అల్లరి పిడుగు, మల్లీశ్వరి చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించిన కత్రినా కైఫ్ మరోసారి ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్నారు. మలయాళంలో మమ్ముట్టి సరసన ఆమె నటించిన ‘బలరామ్ వర్సెస్ తారాదాస్’ చిత్రాన్ని ఎమ్. వెంకట్రావ్ ‘ది డాన్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వెంకట్రావ్ మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఒక డాన్, ఓ సినిమా తార మధ్య సాగే ప్రేమకథ ఇది. జెస్సీ గిఫ్ట్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు. వాణీ విశ్వనాథ్, ముమైత్‌ఖాన్, నాజర్ దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: ఐ.వి. శశి.