breaking news
the don
-
మా దేశానికి ట్రంప్.. పాక్ మీడియా కలరింగ్.. వైట్‌హౌస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నారని పాక్ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అమెరికాలోని వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్.. పాక్ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదని.. ఆయన పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది.అయితే, ఇస్లామాబాద్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారని పాక్ మీడియా కథనాలపై తాజాగా వైట్‌హౌస్ అధికారులు స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. పాక్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఏమీ లేదు. జూలై 18వ తేదీన ట్రంప్.. పాకిస్తాన్లో పర్యటించడం లేదు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ఇదే సమయంలో పాక్ మీడియా తప్పుడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ట్రంప్.. పాక్ పర్యటిస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. పాక్ మీడియా అత్యుత్సాహంతో ట్రంప్.. పర్యటనకు వస్తున్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత పాక్‌ను సందర్శించే అవకాశం ఉందని ది డాన్ వెల్లడించింది. ఆ తరువాతే భారత పర్యటన ఉంటుందని అంచనావేసింది. సెప్టెంబర్‌లో భారత్ క్వాడ్ సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి భారత్‌కు ట్రంప్ వస్తారని పేర్కొంది.#Newsfatafat | Pakistani media reported that U.S. President Donald #Trump would visit #Pakistan in September, marking the first visit by a U.S. president in two decades. However, the White House has denied the claim, stating that no such trip is scheduled. The reports have since… pic.twitter.com/I6JjWaTq38— ET NOW (@ETNOWlive) July 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో అమెరికా అధ్యక్షుడు పర్యటించడం చాలా అరుదు. 2006లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. పాకిస్తాన్లో పర్యటించారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షులు ఎవరూ పాక్ పర్యటనకు వెళ్లలేదు. ఇదిలా ఉండగా.. ట్రంప్ విదేశీ పర్యటనలపై యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 25-జూలై 29 వరకు ట్రంప్.. స్కాట్లాండ్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17-19 మధ్య ట్రంప్ యూకే పర్యటన ఉందని ఆమె స్పష్టం చేశారు. -
డాన్‌తో ప్రేమ
అల్లరి పిడుగు, మల్లీశ్వరి చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించిన కత్రినా కైఫ్ మరోసారి ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్నారు. మలయాళంలో మమ్ముట్టి సరసన ఆమె నటించిన ‘బలరామ్ వర్సెస్ తారాదాస్’ చిత్రాన్ని ఎమ్. వెంకట్రావ్ ‘ది డాన్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వెంకట్రావ్ మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఒక డాన్, ఓ సినిమా తార మధ్య సాగే ప్రేమకథ ఇది. జెస్సీ గిఫ్ట్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ సమాహారంతో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు. వాణీ విశ్వనాథ్, ముమైత్‌ఖాన్, నాజర్ దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: ఐ.వి. శశి.