'సరైనోడు టీమ్ తరపున థ్యాంక్స్' | thank you to audiences on behalf of Team Sarrainodu, says Allu Sirish | Sakshi
Sakshi News home page

'సరైనోడు టీమ్ తరపున థ్యాంక్స్'

May 17 2016 4:59 PM | Updated on Sep 4 2017 12:18 AM

'సరైనోడు టీమ్ తరపున థ్యాంక్స్'

'సరైనోడు టీమ్ తరపున థ్యాంక్స్'

'సరైనోడు' సినిమా యూనిట్ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రేక్షకులకు హీరో అల్లు శిరీష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.

హైదరాబాద్: 'సరైనోడు' సినిమా యూనిట్ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రేక్షకులకు హీరో అల్లు శిరీష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. రాజమౌళి సినిమాల తర్వాత 'సరైనోడు' ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నంబవన్ గా నిలిచినందుకు అతడు ట్విటర్ ద్వారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. బాహుబలి, మగధీర మాత్రమే 'సరైనోడు'కు కంటే ముందున్నాయని వెల్లడించాడు.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వంద కోట్లు వసూలు చేసి తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన స్థానం సంపాదించింది. తనకు మరచిపోలేని భారీ విజయం అందించినందుకు బన్నీ ఇప్పటికే ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement