పెళ్లి కుదిరాక...

Thaman Re Recording for Happy Wedding - Sakshi

‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే వరకూ రెండు కుటుంబాల మనసుల్లో ఏం జరుగుతుందో మా  సినిమాలో చూపించాం’’ అంటున్నారు ‘హ్యాపి వెడ్డింగ్‌’ చిత్రబృందం. సుమంత్‌ అశ్విన్, నిహారికా జంటగా లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్‌ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్‌’. ‘ఫిదా’ ఫేమ్‌ శక్తికాంత్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్‌ రీ–రీకార్డింగ్‌ చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూవీ క్రియేషన్స్‌ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలసి ఈ సినిమా చేస్తున్నాం. లక్ష్మణ్‌ విజన్‌ ఉన్న దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి తమన్‌ ఎంటర్‌ అయ్యారు. తనదైన రీ–రికార్డింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేయనున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top