హాకీ ఎక్స్‌ప్రెస్‌ | Tenali Ramakrishna locks its release date | Sakshi
Sakshi News home page

హాకీ ఎక్స్‌ప్రెస్‌

Nov 5 2019 3:04 AM | Updated on Nov 5 2019 3:04 AM

Tenali Ramakrishna locks its release date - Sakshi

నిన్న కాక మొన్న విడుదలైన సూపర్‌హిట్‌ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నినువీడని నీడను నేను’తో మంచి సక్సెస్‌ సాధించారు. ఈ నెల 15న ‘తెనాలి రామకృష్ణ’ అంటూ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం స్పోర్ట్స్‌ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ని ప్రారంభించి మంచి స్పీడు మీదున్నారు ప్రామిసింగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా వన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాకీ ఆట ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సందీప్‌ కిషన్‌ తొలిసారిగా నటిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. సందీప్, మురళీశర్మ, రఘుబాబులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, కెమెరా: కెవిన్‌రాజు, ఎడిటింగ్‌: ఛోటా.కె. ప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement