టెంపర్‌ రీమేక్‌ వాయిదా!

Temper Tamil Version Ayogya Postponed - Sakshi

పూరి జగన్నాథ్‌, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా టెంపర్‌. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను ప్రస్తుతం కోలీవుడ్‌లో అయోగ్య పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. విశాల్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అయోగ్య రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇటీవల షూటింగ్‌లో విశాల్ గాయపడటం, తరువాత నిశ్చితార్థం పనుల్లో విశాల్‌ బిజీగా కావటంతో షూటింగ్ ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 19న కాకుండా మే 10న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా అయోగ్య వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top