రౌడీ... పోలీస్ అయితే! | Telugu remake of 'Jilla' set to roll | Sakshi
Sakshi News home page

రౌడీ... పోలీస్ అయితే!

Apr 28 2015 11:50 PM | Updated on Sep 3 2017 1:02 AM

రౌడీ... పోలీస్ అయితే!

రౌడీ... పోలీస్ అయితే!

పోలీసులంటేనే ఇష్టపడని ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో ఖాకీ చొక్కా ధరిస్తే..! అతని జీవితం ఎలాంటి

 పోలీసులంటేనే ఇష్టపడని ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో ఖాకీ చొక్కా ధరిస్తే..! అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జిల్లా’. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా ఆర్‌టీ నీసన్ దర్శకత్వంలో రూపొంది తమిళనాట ఘనవిజయం సాధించిన ‘జిల్లా’ చిత్రాన్ని అదే పేరుతో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించారు.

 కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘తెలుగులో ఈ సినిమాకు చాలా పేర్లు అనుకున్నాం. కానీ ఈ సినిమాకు ‘జిల్లా’ టె టిల్ బాగా సరైందనిపించి, దీనినే ఖరారు చేశాం. ఈ తెలుగు వెర్షన్ కోసం బ్రహ్మానందం, సురేఖావాణి, ఎల్బీ శ్రీరాం తదితరులపై హాస్య సన్నివేశాలు చిత్రీకరించాం. హీరో జీవా ఓ సన్నివేశంలో తళుక్కున మెరవనున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నామన శంకర్‌రావు, సమర్పణ: ఆర్.బి.చౌదరి.
 

Advertisement
 
Advertisement
Advertisement