సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

Telugu Movie Darpanam Release Date Confirmed - Sakshi

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని  సెప్టెంబర్‌6న విడుదలకానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ..‘ఈ మధ్య కాలంలో థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. 

నిర్మాత క్రాంతి కిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము.. దర్శకుడు రామకృష్ణ మేకింగ్‌ ఈ చిత్రానికి మంచి అసెట్‌ అవుతుంది. అందరు సపోర్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం' అని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top