వెంకీ 60 రోజుల్లో పూర్తి చేస్తాడట..! | Teja Venkatesh Movie updates | Sakshi
Sakshi News home page

Dec 9 2017 3:31 PM | Updated on Aug 29 2018 1:59 PM

Teja Venkatesh Movie updates - Sakshi

సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటే మరో సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. సినిమాకు సినిమాకు మధ్య భారీగా గ్యాప్ తీసుకుంటూ నెమ్మదిగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. గురు సినిమా తరువాత మరోసారి గ్యాప్ తీసుకున్న వెంకీ ఇటీవల తేజ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వెంకీ కూడా ఈ సినిమాను వేసవి బరిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అందుకు తగ్గట్టుగా షూటింగ్ కోసం పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని 60 రోజుల్లోనే పూర్తి చేసేలా తేజ టీం షూటింగ్ ను ప్లాన్ చేసింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా.. అభినందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వెంకీతో తెరకెక్కించబోయే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ పనులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు తేజ.

Advertisement
 
Advertisement
Advertisement