దసరా కానుకగా ‘సర్కార్‌’ టీజర్‌ | Teaser Of Thalapathy Vijay Sarkar On 19th October | Sakshi
Sakshi News home page

Oct 10 2018 12:31 PM | Updated on Oct 10 2018 12:31 PM

Teaser Of Thalapathy Vijay Sarkar On 19th October - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో సర్కార్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్‌. షూటింగ్‌ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్‌ చేస్తున్నారు.

చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్  చేయనున్నట్టుగా ప్రటించారు యూనిట్‌. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 19న విజయ్‌ సర్కార్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న సర్కార్‌ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement