మనలోని రామాయణం! | Teaser Talk: 'Manaloni' Ramayanam | Sakshi
Sakshi News home page

మనలోని రామాయణం!

Aug 12 2016 8:23 PM | Updated on Sep 4 2017 9:00 AM

మనలోని రామాయణం!

మనలోని రామాయణం!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన ఊరి రామాయణం'.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన ఊరి రామాయణం'. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరంలో బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న పాట.. సినిమా థీమ్ను వివరిస్తుంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భుజంగయ్య అనే పల్లెటూరి పెద్ద మనిషి పాత్రలో అలరించనున్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మనుషులు, సంఘటనలతో కూడిన సహజమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. టీజర్ చివరలో ప్రముఖ తార ప్రియమణి మెరిసి మాయమవుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement