కథే హీరో | tanniru vishwanath about m6 movie | Sakshi
Sakshi News home page

కథే హీరో

Feb 4 2019 5:49 AM | Updated on Feb 4 2019 5:49 AM

tanniru vishwanath about m6 movie - Sakshi

తన్నీరు విశ్వనాథ్‌

‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే మాలాంటి కొత్త నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది’’ అని నిర్మాత తన్నీరు విశ్వనాథ్‌ అన్నారు. ధ్రువ, అశ్విని జంటగా జైరాం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్‌ 6’. తన్నీరు విశ్వనాథ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘నటుడు అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో కొన్ని సీరియల్స్‌లో నటించాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌ నిర్మించాను. కొంతకాలం దర్శకత్వ శాఖలో కూడా పని చేశాను. ఇప్పుడు ‘యమ్‌ 6’ చిత్రం నిర్మించా.  ఈ చిత్రానికి కథే హీరో.  విజయ్‌ బాలాజీ మంచి సంగీతం అందించారు. నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. త్వరలో వివరాలు చెబుతా’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement