'మహేష్ సినిమా కాబట్టే చేశా' | tamil hero bharath About Spyder movie | Sakshi
Sakshi News home page

'మహేష్ సినిమా కాబట్టే చేశా'

Aug 1 2017 1:37 PM | Updated on Sep 17 2017 5:03 PM

'మహేష్ సినిమా కాబట్టే చేశా'

'మహేష్ సినిమా కాబట్టే చేశా'

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకే సినిమాలో కీలక పాత్రలకు పలువురు కోలీవుడ్ నటులను ఎంపిక చేశారు. మెయిన్ విలన్ గా నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తుండగా.. మరో విలన్ గా యంగ్ హీరో భరత్ నటిస్తున్నాడు.

అయితే విలన్ రోల్ పై భరత్ ఆసక్తికరంగా స్పందించాడు. ఇది మహేష్ బాబు సినిమా కాబట్టే ప్రతినాయక పాత్రలో నటించానని మరే హీరో సినిమాలోనూ విలన్ గా చేయనని చెప్పాడు. ఈ సినిమాలో మహేష్, భరత్ ల మధ్య జరిగే ఓ ఫైట్ సీన్ ను రోలర్ కోస్టర్ పై దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement