పాపా... ఏ క్లాస్‌ చదువుతున్నావ్‌? | Tamanna is acting the role of a school girl. | Sakshi
Sakshi News home page

పాపా... ఏ క్లాస్‌ చదువుతున్నావ్‌?

Jun 4 2017 4:54 AM | Updated on Sep 15 2019 12:38 PM

పాపా... ఏ క్లాస్‌ చదువుతున్నావ్‌? - Sakshi

పాపా... ఏ క్లాస్‌ చదువుతున్నావ్‌?

రియల్‌ లైఫ్‌లో స్టూడెంట్‌ లైఫ్‌ను సరిగా ఎంజాయ్‌ చేయలేదని తమన్నా పలు సందర్భాల్లో చెప్పారు.

రియల్‌ లైఫ్‌లో స్టూడెంట్‌ లైఫ్‌ను సరిగా ఎంజాయ్‌ చేయలేదని తమన్నా పలు సందర్భాల్లో చెప్పారు. 15 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా పరిచయం కావడంతో ఆమె కాలేజీకి వెళ్లిందే లేదు. అప్పుడు మిస్‌ అయిన స్టూడెంట్‌ లైఫ్‌ను ఇప్పుడు బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నారు.

సందీప్‌ కిషన్, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్‌ కోహ్లి దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ కామెడీ సిన్మా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా స్కూల్‌ గాళ్‌గా నటిస్తున్నారు. ఆమె ఏ క్లాస్‌ చదువుతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌! దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరితో కలసి నటుడు–నిర్మాత సచిన్‌ జోషి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లో జరుగుతోంది. ఇందులో హీరో నవదీప్‌ కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం. లండన్‌లోని ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో ఆయన ఎక్కువ కనిపిస్తున్నారని చూసినోళ్లు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement