అంత సీన్ లేదండీ బాబూ! | Tamanna completes 10 years in the film industry | Sakshi
Sakshi News home page

అంత సీన్ లేదండీ బాబూ!

Feb 12 2015 11:36 PM | Updated on Sep 2 2017 9:12 PM

అంత సీన్ లేదండీ బాబూ!

అంత సీన్ లేదండీ బాబూ!

మిల్క్ బ్యూటీ తమన్నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పినవాళ్లూ, చెబుతున్నవాళ్లూ చాలామందే ఉన్నారు.

మిల్క్ బ్యూటీ తమన్నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పినవాళ్లూ, చెబుతున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. మరి, తమన్నా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? ఇంతవరకూ ఆమెకు నచ్చిన వ్యక్తి తారసపడలేదా? ఈ ప్రశ్నలే తమన్నా ముందుంచితే - ‘‘ఒకవేళ ప్రేమలో పడాలని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే, ఎవరో ఒకరు నచ్చేవారేమో. కానీ, ఇప్పటివరకు నాకు పరిచయమైనవాళ్లల్లో ఏ అబ్బాయినీ ఆ కోణంలో చూడలేదు.
 
 అసలు నాకంత తీరిక ఎక్కడుంది? హీరోయిన్ అయ్యి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లూ ఎలా గడిచిపోయాయో తెలియడంలేదు. ఏదో నిన్నా, మొన్నా వచ్చినట్లుంది’’ అన్నారు. డేటింగ్ పై మీ అభిప్రాయం? అనడిగితే - ‘‘బాగానే ఉంటుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకూ ఆ అనుభవం లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికే కష్టంగా ఉంది. ఇక, మిగతావాటికి ఎక్కడ టైముంటుంది? ఇప్పట్లో డేటింగ్ చేసే సీన్ లేదండీ బాబూ. ప్రస్తుతం నా ప్రేమనంతా సినిమాలకు అంకితం చేసేశా’’ అని తమన్నా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement