అలాంటి పాత్రలకు మేకప్ అవసరంలేదు! | Tamanna Bhatia without Makeup in tamil movie | Sakshi
Sakshi News home page

అలాంటి పాత్రలకు మేకప్ అవసరంలేదు!

Feb 28 2016 11:02 PM | Updated on Sep 3 2017 6:37 PM

అలాంటి పాత్రలకు మేకప్ అవసరంలేదు!

అలాంటి పాత్రలకు మేకప్ అవసరంలేదు!

వెండితెరపై ధగదగ మెరిసిపోవడం కోసం నటీనటులందరూ మేకప్ చేసుకుంటారనే విషయం తెలిసిందే.

వెండితెరపై ధగదగ మెరిసిపోవడం కోసం నటీనటులందరూ మేకప్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. కథానాయికలైతే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. హీరోతో పోల్చితే సినిమాలో హీరోయిన్లు కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా ఎక్కువ మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
 అందుకే, తక్కువ మేకప్ డిమాండ్ చేసే పాత్రలు వచ్చినప్పుడు కథానాయికలు సంబరపడిపోతారు. ప్రస్తుతం తమన్నా ఆ సంబరంలోనే ఉన్నారు. తమిళ చిత్రం ‘ధర్మదురై’లో ఆమె తక్కువ మేకప్‌తో కనిపించనున్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ - ‘‘పాత్ర అందమైనది అయినప్పుడు ప్రత్యేకంగా అందంగా కనిపించాల్సిన అవసరంలేదు. ఆ పాత్ర డీ-గ్లామరైజ్డ్‌గా ఉన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది.
 
 అలాంటి బలమైన పాత్రనే నేను ‘ధర్మదురై’లో చేశాను. నిండైన చీరకట్టు, తలనిండా పువ్వులతో ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించని విధంగా ఇందులో కనిపిస్తాను. ఈ చిత్రదర్శకుడు శీను రామస్వామి ‘రియలిస్టిక్ ఫిలింస్’ తీస్తారు. ‘ధర్మదురై’ కూడా అలానే ఉంటుంది. పాత్రలన్నీ నిత్యజీవితంలో మనం చూస్తున్నట్లుగానే ఉంటాయి. అందుకే ఇప్పటివరకూ నాకు ఆత్మసంతృప్తిని ఇచ్చిన చిత్రాల్లో దీనికి కూడా చోటు ఇచ్చా’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement