తేనిలో తమన్నా
నేను మదురై సమీపంలోని తేని గ్రామానికి వచ్చానని తమన్న ట్విట్టర్లో పేర్నొన్నారు. కొన్ని చిత్రాలు కొందరి జీవితాల్లో మైలురాయిగా నిలిచిపోతాయి.ఆ విధంగా నటి తమన్నా నట జీవితం బాహుబలి చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పుకోవచ్చు. దాదాపు దశాబ్దం తరువాత బాహుబలి చిత్రం ఈ గుజరాతీ భామకు అనూహ్య హైప్‌ను తెచ్చిపెట్టింది. అవంతికగా తన అభినయం అమితంగా అలరించింది. అంతకు ముందు తమన్నా పనైపోయింది అన్న ఇప్పుడు ఔరా తమన్నా అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు, తమిళం భాషల్లో బిజీ కథానాయకి అని చెప్పవచ్చు.
తమిళంలో ఇటీవల ఆమె నటించిన వాసువుమ్ శరవణనుమ్ చిత్రం పెద్దగా ఆడకపోయినా వరుసగా అవకాశాలు రావడం విశేషం. తాజాగా శీను రామసామి దర్శకత్వంలో విజయ్ సేతుపతికి జంటగా ధర్మదురై అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే మదురై జిల్లా సమీపంలో తేని గ్రామంలో ప్రారంభమైంది. దీని గురించి తమన్నా ట్విట్టర్లో పేర్కొంటూ నేనిప్పుడు ధర్మదురై చిత్రం కోసం తేని గ్రామానికి వచ్చాను.శీను రామసామి దర్శకత్వంలో నటించడం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నాను. ఇది సోషల్ డ్రామాతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రం.
ఇందులో నాతో పాటు శివద , ఐశ్వర్యారాజేశ్, శ్రుష్టి డాంగే నటిస్తున్నారు. ముఖ్య పాత్రను నటి రాధిక పోషిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ధర్మదురై చిత్రం జూన్‌లో తెరపైకి రానుంది అని తెలిపారు. తమన్నా ఈ చిత్రంతో పాటు నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ఊపిరి(తమిళంలో దోస్త్) చిత్రం, బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్నారు.