ఇదా విషయం | tamanna act's in movie is Ondraga padittavaragal | Sakshi
Sakshi News home page

ఇదా విషయం

Nov 29 2014 2:44 AM | Updated on Apr 3 2019 9:17 PM

ఇదా విషయం - Sakshi

ఇదా విషయం

నటి తమన్న దరిదాపులకు ఎవరూ రాకుండా చిత్ర యూనిట్ గట్టి భద్రత ఏర్పాటు చేసింది.

నటి తమన్న దరిదాపులకు ఎవరూ రాకుండా చిత్ర యూనిట్ గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ఈ భద్రతకు కారణమేంటన్న విషయమై కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కోలీవుడ్‌లో పైయ్యా, అయన్, వీరం తదితర విజయవంతమైన చిత్రాల్లో తమన్న నటించిం ది. ఈ భామ కొంతకాలం కోలీవుడ్‌కు దూరమైంది. ఈ సమయంలో బాలీవుడ్‌లో పాగా వేసేందుకు యత్నించింది. అయితే అక్కడ ఈ బ్యూటీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆర్య సరసన వాసువుం శరనణనుం ఒండ్రాగ పడిత్తవరగళ్ అనే చిత్రంలో నటిస్తోంది.

రాజేష్.ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్య నిర్మించడం విశేషం. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్‌లో తమన్న దరిదాపుల్లోకి ఎవరినీ చేరనీయకుండా రక్షణ వలయాన్ని దర్శకుడు ఏర్పాటు చేశారట. ముఖ్యంగా మీడియా వాళ్లు తమన్నను కలవకూడదని ఆదేశించారట. కారణం ఏమిటి అని ఆరా తీస్తే మీడియా తమన్న పాత్ర, ప్రేమ విషయాల గురించి ప్రశ్నిస్తే ఆ భామ ఎక్కడ మూడ్ అవుట్ అవుతుందోనని ఇలా భద్రత ఏర్పాటు చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement