
లాంగ్ గ్యాప్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కొత్త సినిమాను ప్రారంభించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను ప్రస్తుతం ‘ఏఏ19’గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో టబు లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అత్తారింటింకి దారేది సినిమాలో నదియా పాత్ర తరహాలోనే టబు పాత్రను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి క్యారెక్టర్ టబు కూడా సౌత్‌లో బిజీ ఆర్టిస్ట్ అవుతారేమో చూడాలి.