బిగ్బి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది | Taapsee pannu teams up with Amithab Bacchan | Sakshi
Sakshi News home page

బిగ్బి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

Dec 24 2015 11:38 AM | Updated on May 28 2018 4:05 PM

బిగ్బి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది - Sakshi

బిగ్బి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయి, తరువాత నార్త్ మీద దృష్టి పెట్టిన ఢిల్లీ బ్యూటి తాప్సీ పను. ఇప్పటి వరకు కెరీర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా ఆసక్తికరమైన...

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమై, తరువాత నార్త్ మీద దృష్టి పెట్టిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇప్పటి వరకు కెరీర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా ఆసక్తికరమైన సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే అక్షయ్ కుమార్ సరసన బేబి సినిమాతో యాక్షన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ ఓ క్రేజీ ఆఫర్ను కొట్టేసింది.

బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనుంది. బిగ్ బి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఛాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతుంది ఈ అమ్మడు. పూర్తిగా ఢిల్లీలో షూటింగ్ జరగనున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది తాప్సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement