‘నాకు ఇళ్లు అద్దెకివ్వడానికి భయపడ్డారు’ | Taapsee Pannu Reveals No One Wanted To Rent An Apartment To Her | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, హైదరాబాద్‌ రెండు ఒకేలా ఉంటాయి : తాప్సీ

Jun 7 2019 8:21 PM | Updated on Jun 7 2019 8:28 PM

Taapsee Pannu Reveals No One Wanted To Rent An Apartment To Her - Sakshi

ఒకానొక సమయంలో నాకు ఉండటానికి ఇళ్లు కూడా దొరకలేదు అంటున్నారు హీరోయిన్‌ తాప్సీ. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సీ.. కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకున్నారు. ‘ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే రోజుల్లో ఎన్నో కష్టాలు చవి చూశాను. ముఖ్యంగా నాకు ఎక్కడా ఇళ్లు అద్దెకు దొరకలేదు. కారణం నేను సినిమాల్లో నటిస్తానని చెప్పడం. సినిమా రంగం వారు అంటే జనాలకు పెద్దగా నమ్మకం ఉండదు. 500 ఖర్చు చేసి థియేటర్‌కు వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇష్టపడతారు కానీ మేం కూడా వారితో పాటు కలిసి ఉండటానికి వారు ఒప్పుకోరు. ఈ విషయంలో నేను చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముంబైలో నాకు ఇళ్లు దొరకడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింద’న్నారు.

అదే హైదరాబాద్‌లో ఇంటి విషయంలో తనకు ఎలాంటి సమయ్యలు ఎదురుకాలేదని తెలిపారు. ‘నేను ఢిల్లీ అమ్మాయిని. ఆలోచన విధానంలో హైదరాబాద్‌, ఢిల్లీ రెండు ఒకేలా ఉంటాయి. ఈ ప్రదేశం నాకు ఎంతో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఇక్కడ కుదురుకున్నాను. ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో నా చెల్లితో కలిసి సంతోషంగా ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం తాప్సీ అక్షయ్‌ కుమార్‌తో కలిసి మిషన్‌ మంగళ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement