వారి కంటే నాకు తక్కువే

Taapsee pannu Clarity on Her Remuneration - Sakshi

సినిమా: ఇప్పుడు కథానాయికలకు పారితోషికం పెరిగిందని చెప్పుకొచ్చింది నటి తాప్సీ. స్కిన్‌షో వంటి ఇతర అంశాలతో నటిగా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. అక్కడ హీరోయిన్‌ ఓరి యంటెడ్‌ కథా చిత్రాల అవకాశాలతో పాటు వరుస విజయాలు వరించడంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిం ది. ఈ మధ్య దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్‌ కావడంతో ఈ అమ్మడు ఖుషీ అయిపోతోంది. అంతే కాదు సక్సెస్‌లతో పారితోషికం పెరిగిపోతుంది కదా! తాప్సీ తన పారితోషికాన్ని పెంచేసింది. ఇటీవల కథానాయికలకు ప్రాముఖ్యత పెరిగిందని అందుకే పారితోషికం పెరిగిందని అంది. బాలీవుడ్‌ హీరోయిన్లు రూ.20 కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడమే ఈ మార్పుకు చిన్న ఉదాహరణగా చెబుతోంది.

ఇంతకు ముందైతే హీరోయిన్లు కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటేనే వామ్మో అంటూ నోరెళ్లబెట్టేవాళ్లని, ఇప్పుడు హీరోయిన్లు నటించిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో పారితోషికం పెరిగిందని చెప్పింది. హీరోయిన్‌ ఓరియం టెడ్‌ కథా చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయని అంది. అయితే హీందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ హీరో, హీరోయిన్‌ పారితోషికంలో వ్యత్యాసం ఉందని చెప్పింది. తాను రెండేళ్లుగా హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న కథా పాత్రల్లో నటిస్తున్నానని, అయినా తన పారితోషికం తక్కువేనని చెప్పింది. అయితే తనకు డబ్బు ముఖ్యం కాదని, మంచి నటిగా పేరు తెచ్చుకున్న తరువాతనే డబ్బు గురించి ఆలోచిస్తానని అంటోంది ఈ ఢిల్లీ బ్యూటీ. ఇటీవల కోలీవుడ్‌లో గేమ్‌ఓవర్, తెలుగులో ఆనందోబ్రహ్మ వంటి సక్సెస్‌లను అందుకున్నా ఇప్పుడు దక్షిణాదిలో అవకాశాలు లేవు. త్వరలో ఒక తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే హిందీలో మూడు చిత్రాలతో బిజీగానే ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top