గురువు వస్తున్నారు | syera narasimha reddy movie shooting updates | Sakshi
Sakshi News home page

గురువు వస్తున్నారు

Mar 7 2019 2:18 AM | Updated on Mar 7 2019 2:18 AM

syera narasimha reddy movie shooting updates - Sakshi

చిరంజీవి, ‘సైరా’లో అమితాబ్‌

నరసింహారెడ్డి గురువు చాలా రోజుల తర్వాత మళ్లీ రాబోతున్నారు. కొన్ని నెలల క్రితం గురు శిష్యులిద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన గురువుగా అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ కొన్ని నెలల క్రితం ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు అమితాబ్‌. మరో నాలుగు రోజులు ఆయన షూటింగ్‌లో పాల్గొంటే చాలు.. ఆ పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిపోతుంది.

ఈ నెల 13 నుంచి 16 వరకూ చిత్రీకరించే కీలక సన్నివేశాల కోసం అమితాబ్‌ హైదరాబాద్‌ రానున్నారని సమాచారం. కొన్ని రోజులుగా షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చిన చిత్రబృందం బుధవారం మళ్లీ షెడ్యూల్‌ మొదలుపెట్టింది. హైదరాబాద్‌ శివార్లలో వేసిన ప్రత్యేక భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోందని తెలిసింది. ఈ నెలలో జరిపే షూటింగ్‌తో 95 శాతం సినిమా పూర్తవుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

Advertisement
 
Advertisement
Advertisement