రై.. రై... రైఫిల్‌ | Sakshi
Sakshi News home page

రై.. రై... రైఫిల్‌

Published Sun, Nov 11 2018 5:35 AM

sye raa narasimha reddy rifle shooting scene - Sakshi

వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేయాలని ‘సైరా’ టీమ్‌ భావిస్తున్నట్లుంది. ఇటీవల జార్జియాలో క్లైమాక్స్‌ను కంప్లీట్‌ చేసిన ‘సైరా’ టీమ్‌ పెద్ద గ్యాప్‌ తీసుకోకుండానే తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం చిరంజీవి రైఫిల్‌ షూట్‌ నేర్చుకుంటున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో రేపటి నుంచి నయనతార పాల్గొంటారని సమాచారం. అలాగే ఈ నెల 15న తమన్నా సెట్‌లో జాయిన్‌ అవుతారని వినికిడి. మరి సినిమాలో నయనతార, తమన్నా కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్‌. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుందని టాక్‌.
 

Advertisement
 
Advertisement
 
Advertisement