స్వయంవద ట్రైలర్‌ లాంచ్‌ చేసిన కోదండ రామిరెడ్డి

Swayamvada Movie Trailer Launch By Director Kodandarami Reddy - Sakshi

ఏప్రిల్ 26న భారీ ఎత్తున రిలీజ్

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా తెరకెక్కిన సినిమా ‘స్వయంవ‌ద’. ఈ సినిమాను ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు A. కోదండరామిరెడ్డి విడుదల చేసారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. పెద్ద ఆర్టిస్టులు కలసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతోంది. వివేక్ మొదటి సినిమానే అయినా ఎంతో బాగా తెరకెక్కించారు’ అన్నారు.

దర్శకులు వివేక్ వర్మ మాట్లాడుతూ ‘మా స్వయంవధ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కోదండరామిరెడ్డి గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినాయి.U A సర్టిఫికెట్ వచ్చింది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశారు అని ప్రశంసించారు’ అని తెలిపారు.

నిర్మాత రాజా దుర్వాసుల మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్ ను ఆవిష్కరించి మా యూనిట్ ని ఆశీర్వదించిన దర్శకులు కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదము. ఏప్రిల్ 26న దాదాపు 200లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top