మెగాస్టార్‌కు క‌టింగ్ చేసిన పెద్ద కూతురు | Sushmita Konidela Hair Cutting To Megastar Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరు జుట్టుతో ఆడుకున్న సుష్మిత‌

Jun 21 2020 3:24 PM | Updated on Jun 21 2020 5:19 PM

Sushmita Konidela Hair Cutting To Megastar Chiranjeevi - Sakshi

తండ్రికి భ‌య‌ప‌డే కూతుర్లు ఉంటారు. తండ్రి ద‌గ్గ‌ర గారాలు పోయే పిల్లలూ ఉంటారు. కానీ తండ్రిని ప్రేమించ‌ని కూతుళ్లుండ‌రు. నేడు "ఫాద‌ర్స్ డే" సంద‌ర్భంగా సుష్మిత కొణిదెల ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బార్బ‌ర్ అవ‌తారం ఎత్తింది. అది కూడా తండ్రి కోసం! ఓ చేతిలో క‌త్తెర‌, మ‌రో చేతిలో దువ్వెన ప‌ట్టుకుని మెగాస్టార్ చిరంజీవికి క్ష‌వ‌రం చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ హెయిర్ కటింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే చివ‌ర్లో మెగాస్టార్ లుక్ మాత్రం చూపించ‌లేదు. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్‌)

మ‌రోవైపు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చరణ్ కూడా చిన్నప్పుడు తండ్రితో క‌లిసి దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ ఫాద‌ర్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన విష‌యం తెలిసిందే. చిరంజీవి-సురేఖ దంప‌తుల‌కు కొడుకు రామ్‌చ‌ర‌ణ్‌తోపాటు‌, ఇద్ద‌రు కూతుర్లు సుష్మిత‌, శ్రీజ ఉన్నారు. పెద్ద కూతురు సుష్మిత‌ త‌న తండ్రి న‌టించిన 'ఖైదీ నంబ‌ర్ 150''తో పాటు 'రంగ‌స్థ‌లం', 'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమాల‌కు డిజైన‌ర్‌గా ప‌ని చేసింది. త‌క్కువ సినిమాల‌కే ప‌ని చేసినా టాలీవుడ్‌లో మంచి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా పేరు గ‌డించింది. (రోల్‌ మోడల్‌ రీల్‌ ఫాదర్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement