'సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు' | Sushant Singh Rajput Lost 7 Films Claims Sanjay Nirupam | Sakshi
Sakshi News home page

'కావాల‌నే సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు'

Jun 16 2020 2:59 PM | Updated on Jun 16 2020 3:42 PM

Sushant Singh Rajput Lost 7 Films Claims Sanjay Nirupam - Sakshi

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మ‌ర‌ణంపై రాజ‌కీయ నాయ‌కుడు సంజ‌య్ నిరుప‌మ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 'చిచోర్' సినిమా విజ‌య‌వంతం అయిన‌ప్ప‌టికీ కావాల‌నే 7 సినిమాల్లో సుశాంత్‌ని  త‌ప్పించార‌ని ట్వీట్ చేశారు.  సినిమా స‌క్సెస్ కాగానే ఏడు సినిమాల‌కి సుశాంత్ సైన్ చేయ‌గా, ఈ ఆరు నెల‌ల్లోనే ఆ చిత్రాల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని దీనికి కార‌ణం ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించారు. హిందీ ప‌రిశ్ర‌మ క్రూర‌త్వం మ‌రో స్థాయికి  చేరింద‌ని, ఓ ప్ర‌తిభ గ‌ల నటుడిని బ‌లితీసుకుందంటూ ట్విటర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు.  
(సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్‌)

సుశాంత్ మ‌ర‌ణంపై ప్ర‌ముఖ దర్శకుడు శేఖ‌ర్ క‌పూర్ మాట్లాడుతూ.. 'పానీ' చిత్రంలో సుశాంత్ అద్భుతంగా న‌టించాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్ట్ ఆల‌స్యం అయ్యింది. నీ ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేక నీకు సినిమాలు దూరం చేసిన వారు నాకు తెలుసు. గ‌త ఆరు నెలల్లో నేను మీ ద‌గ్గ‌ర ఉండి ఉంటే బావుండేది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక కొంద‌రు ప్ర‌ముఖ‌లు సైతం బాలీవుడ్‌లో పేరుకుపోయిన నెపోటిజాన్ని బాహాటంగానే వెళ్ల‌గక్కుతున్నారు. కంగ‌నా, వివేక్ ఒబెరాయ్, ప్ర‌కాశ్ రాజ్..ఇలా పలువురు సుశాంత్ మ‌ర‌ణంతోనైనా మేల్కోవాల‌ని, ఇప్ప‌టికైనా వార‌స‌త్వాన్ని ప‌క్క‌న‌పెట్టి ప్ర‌తిభకు ప‌ట్టం క‌ట్టాలంటూ నిన‌దిస్తున్నారు. (బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక‌ కుటుంబం కాదు)

Advertisement
 
Advertisement
Advertisement