గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

surya ngk moviereleased on may 31 - Sakshi

నంద గోపాలకృష్ణ 31న రాబోతున్నాడు. తీసుకొస్తున్నది ఎవరో తెలుసా? కేకే రాధామోహన్‌. నంద గోపాలకృష్ణ అంటే హీరో సూర్య పేరు. ‘7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఎన్‌.జి.కె’. అంటే నంద గోపాలకృష్ణ అని అర్థం. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కేకే రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, నిర్మాతలు:ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top