సూర్య పగ | surya the great telugu movie press meet | Sakshi
Sakshi News home page

సూర్య పగ

Apr 13 2018 1:12 AM | Updated on Apr 13 2018 1:12 AM

surya the great telugu movie press meet - Sakshi

తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అనితా ఉదీప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య ది గ్రేట్‌’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సంజయ్, రవి బమ్మావల్, అనిత, తలైవాసల్‌ విజయ్, ఆదిత్యా మీనన్‌ ముఖ్య తారలుగా నటించారు. విదీషా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థపై షీతల్‌ గుప్తా, ఎన్‌.జి. రాజ్‌కుమార్‌ నిర్మించారు.

‘‘బాధ్యత లేని యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. కాలేజీ గొడవల్లో తోటివారి కారణంగా హీరో సూర్య ప్రాణ స్నేహితులు హత్యకు గురవుతారు. శత్రువులపై సూర్య ఎలా పగ తీర్చుకున్నాడు? అన్న అంశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: బోబో శశి, ఎడిటింగ్‌: ఎల్‌.కె. విజయ్‌.

Advertisement
 
Advertisement
Advertisement