చరణ్ను ఇబ్బంది పెడుతున్న సూర్య | Suriya troubling Ram Charan | Sakshi
Sakshi News home page

చరణ్ను ఇబ్బంది పెడుతున్న సూర్య

Nov 15 2016 11:11 AM | Updated on Sep 4 2017 8:10 PM

చరణ్ను ఇబ్బంది పెడుతున్న సూర్య

చరణ్ను ఇబ్బంది పెడుతున్న సూర్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమా మీద...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రూస్లీ లాంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించాలని భావిస్తున్న చరణ్, రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇప్పటికే ఆడియో కూడా రిలీజ్ అయిన ధృవ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే భారీ వసూళ్ల మీద కన్నేసిన మెగా ఫ్యామిలీ తరువాత రెండు వారాల పాటు భారీ చిత్రాలేవి లేకుండా ఉంటే కలెక్షన్ల రికార్డులు సాధ్యమని భావిస్తోంది. కానీ సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 డిసెంబర్ 16న భారీ రిలీజ్కు రెడీ అవుతోంది.

సూర్యకు తెలుగు రాష్ట్రల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటం, సింగం సీరీస్ టాలీవుడ్లో కూడా ఘనవిజయం సాధించి ఉండటంతో ఈ సినిమా ధృవ కలెక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ధృవ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే సూర్యతో పాటు సింగం 3 నిర్మాత జ్ఞానవేల్ రాజాతో సంప్రదింపులు జరుపుతున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement