నా ప్రేయసి...! | Suriya to dub in Telugu for '24'? | Sakshi
Sakshi News home page

నా ప్రేయసి...!

Mar 13 2016 11:11 PM | Updated on Sep 3 2017 7:40 PM

నా ప్రేయసి...!

నా ప్రేయసి...!

మూడు విభిన్నమైన గెటప్‌లతో హీరో సూర్య కనిపించిన ‘24’ చిత్రం టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మూడు విభిన్నమైన గెటప్‌లతో  హీరో సూర్య  కనిపించిన ‘24’ చిత్రం టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘ఇష్క్’, ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ సినిమాస్, స్టూడియోగ్రీన్ సంస్థలు అందిస్తున్నాయి. నిత్యామీనన్, సమంత కథానాయికలు. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల్లోని ఒక పాటను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘  ‘నా ప్రేయసి’ అంటూ సాగే ఈ  పాటను చంద్రబోస్ రాశారు.

త్వరలోనే ఈ చిత్రం పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. టైమ్ ఆధారంగా సాగే ఈ చిత్ర కథాకథనాలు సరికొత్తగా ఉంటాయి. ఇందులో అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి  పాటలు: చంద్రబోస్-శశాంక్ వెన్నెలకంటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రేయాస్ ఖేదేకర్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సూరజ్ సాధన.

Advertisement
 
Advertisement
Advertisement