ధృవ కోసం సింగం 3 వాయిదా..? | Suriya starrer Singam 3 release postponed for ram Charan Dhruva | Sakshi
Sakshi News home page

ధృవ కోసం సింగం 3 వాయిదా..?

Dec 2 2016 12:44 PM | Updated on Sep 4 2017 9:44 PM

ధృవ కోసం సింగం 3 వాయిదా..?

ధృవ కోసం సింగం 3 వాయిదా..?

ఈ సారి ఎలాగైన వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాలన్న కసితో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఏ ఒక్క అవకాశాన్ని...

ఈ సారి ఎలాగైన వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాలన్న కసితో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కాస్త ఆలస్యంగా అయినా పర్ఫెక్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని దసరాకే రిలీజ్ కావాల్సిన ధృవ సినిమాను డిసెంబర్కు వాయిదా వేశాడు. డిసెంబర్ 9న ధృవ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే చరణ్ అనుకున్నట్టుగా వంద కోట్ల కలెక్షన్లు సాధించాలంటే ఈ సినిమా కనీసం రెండు వారాల పాటు థియేటర్లలో ఉండాలి.

కానీ ధృవ రిలీజ్కు కరెక్ట్గా వారం తరువాత, డిసెంబర్ 16న సూర్య హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 3 రిలీజ్ అవుతోంది. తమిళ్తో పాటు తెలుగు నాట కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న సూర్య సినిమా విడుదలైతే ధృవ కలెక్షన్లపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎలాగైన సింగం 3ని వాయిదా వేయించాలని భావించారు. సూర్యకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో సింగం 3 వాయిదా పడటం కాయం అని భావించారు.

అనుకున్నట్టుగానే సూర్య తన సినిమాను వారం పాటు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.., వాయిదా వేస్తేనే రెండు సినిమాలకు మంచిదన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 16న కాకుండా డిసెంబర్ 23న సింగం 3ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సింగం 3 రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement