జ్యోతిక లీడ్ రోల్లో 'నాచియార్' | suriya reveals jyothikas next first look | Sakshi
Sakshi News home page

జ్యోతిక లీడ్ రోల్లో 'నాచియార్'

Feb 28 2017 4:21 PM | Updated on Sep 5 2017 4:51 AM

జ్యోతిక లీడ్ రోల్లో 'నాచియార్'

జ్యోతిక లీడ్ రోల్లో 'నాచియార్'

పెళ్లి తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన స్టార్ హీరోయిన్ జ్యోతిక, రీ ఎంట్రీలో సెలెక్టివ్గా సినిమాలు

పెళ్లి తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన స్టార్ హీరోయిన్ జ్యోతిక, రీ ఎంట్రీలో సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగలిర్ మట్టుమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతోంది ఈ సీనియర్ హీరోయిన్. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా రియలిస్టిక్ సినిమాలను తెరకెక్కించే క్రియేటివ్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో జ్యోతిక ఓ సినిమా చేయనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో సూర్య విడుదల చేశాడు. నాచియార్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జ్యోతికతో పాటు కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ కీలక పాత్రలో నటించనున్నాడు. బి స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఇళయరాజ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement