చాలెంజ్‌ గెలిచా | Sakshi
Sakshi News home page

చాలెంజ్‌ గెలిచా

Published Sat, Jan 6 2018 12:28 AM

Suriya, Keerthy Suresh's Thaana Serndha Koottam - Sakshi

‘‘చిన్నప్పుడు మా అమ్మతో ఓ చాలెంజ్‌ చేశాను. అది ఇప్పటికి గెలిచాను’’ అంటున్నారు కీర్తీ సురేష్‌. నటి మేనక కుమార్తె  కీర్తీ సురేష్‌ అని తెలిసిన విషయమే. ఇంతకీ చిన్నప్పుడు వాళ్ల అమ్మతో కీర్తి ఏమని చాలెంజ్‌ చేసి ఉంటారు? అంటే.. ‘‘నేను చిన్నప్పుడు సూర్యగారికి పెద్ద అభిమానిని. మా అమ్మగారు అప్పటికే సూర్య వాళ్ల నాన్న శివకుమార్‌తో మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఏదో ఒక రోజు వాళ్ల అబ్బాయి సూర్యతో కలిసి నటిస్తాను అని మా అమ్మగారితో చాలెంజ్‌ చేశాను.

అన్నట్టుగానే ఇప్పుడు చాలెంజ్‌ గెలిచాను. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘తానా సేంద కూట్టమ్‌’  (తెలుగులో ‘గ్యాంగ్‌’) చిత్రంలో సూర్య సరసన తొలిసారి యాక్ట్‌ చేశాను. ఈ సినిమాలో సంప్రదాయమైన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్‌. తమిళంలో స్టార్‌ హీరోల సరసన నటిస్తోన్న కీర్తి విజయ్‌తో ‘భైరవ’ సినిమా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారామె.

Advertisement
Advertisement