హిట్ కాంబినేషన్.. నాలుగో సారి.! | Suriya Hari Anushka Combo Again | Sakshi
Sakshi News home page

Aug 4 2018 4:08 PM | Updated on Aug 4 2018 7:46 PM

Suriya Hari Anushka Combo Again - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అనుష్కలది సూపర్‌ హిట్ కాంబినేషన్‌ అన్న సంగతి తెలసిందే. వీరిద్దరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ఘనవిజయం సాధించింది. మూడు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమాలకు హరి దర్శకుడు. ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సూర్య 39వ సినిమాకు హరినే దర్శకత్వం వహించనున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా మరోసారి అనుష్కనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు హరి. అయితే కొద్ది రోజులుగా లుక్‌ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ప్రస్తుతం సినిమాలు అంగీకరించటం లేదు. మరి మరోసారి హరి, సూర్యలతో కలిసి పనిచేసేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement