‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

Surender Reddy Launched Madhanam Movie Teaser - Sakshi

మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది -  సురేంద‌ర్ రెడ్డి

శ్రీనివాస్ సాయి, భావ‌న‌ రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాశీ ప్రొడక్ష‌న్స్  ప‌తాకంపై దివ్యా ప్ర‌సాద్‌, అశోక్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం మ‌థ‌నం. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌ లుక్‌ అందరినీ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ‘సైరా’ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి విడుద‌ల  చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌లో లవ్‌ ఎలిమెంట్స్‌ ఉండటం చూస్తుంటే ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది.

టీజర్‌ విడుదల చేసిన అనంతరం సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్మాత అశోక్ దాదాపు 15 ఏళ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు క‌థా చర్చ‌ల్లో కూడా పాల్గొనేవాడు. త‌న‌కి సినిమాపై మంచి ప‌ట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాల‌ని చాలా  ప్ర‌య‌త్నాలు చేశారు. త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌దిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేళ్ల త‌ర్వాత స‌డెన్‌గా వ‌చ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. ఆయ‌న గ‌ట్స్ ని మెచ్చుకోవాలి.  యదార్థ సంఘ‌ట‌న ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. సినిమాకిదే ప్ల‌స్ అవుతుంది.  

పెద్ద విజ‌యం సాధించాల‌ని, అశోక్‌ పెద్ద నిర్మాత‌గా  ఎద‌గాల‌ని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నా. ద‌ర్శ‌కుడు అజ‌య్ నా సినిమాల‌కి కొరియోగ్ర‌ఫీగా చేశారు. సినిమా చూశా. చాలా బాగుంది. భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా న‌టించారు. టెక్నీషియ‌న్ల వ‌ర్క్ బాగుంది.  సినిమాని అంద‌రు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్ర‌మంలో మ‌రో నిర్మాత దివ్యా ప్ర‌సాద్‌, సుభాష్, స‌త్య శ్రీ, హ‌న్సిక్‌, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top