అంతా ఆస్కార్‌ పుణ్యమే.. | sunny pawar attends for oscar awards | Sakshi
Sakshi News home page

అంతా ఆస్కార్‌ పుణ్యమే..

Mar 1 2017 10:11 PM | Updated on Sep 5 2017 4:56 AM

అంతా ఆస్కార్‌ పుణ్యమే..

అంతా ఆస్కార్‌ పుణ్యమే..

ఒక్కోసారి టైమే జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. అప్పటిదాకా పరిచయంలేని కొత్త లోకాన్ని చూపిస్తుంది.

ఒక్కోసారి టైమే జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. అప్పటిదాకా పరిచయంలేని కొత్త లోకాన్ని చూపిస్తుంది. అందలాలు ఎక్కిస్తుంది. ముంబై కుర్రాడు సన్నీ పవార్‌కు ఇప్పుడు అలాంటి టైమే కలిసొచ్చింది. ఇంతకీ సన్నీ పవార్‌ ఎవరో చెప్పుకోవాలి కదూ..! అయితే ఆ వివరాలు చదవండి... ‘లయన్‌’  సినిమా గుర్తుందా..? మధ్యప్రదేశ్‌లో కొన్నేళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనను హాలీవుడ్‌ సాంకేతికతతో, భారతీయ నటులతో తెరకెక్కించిన చిత్రం. విడుదలై.. మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయితే మొన్న జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో నాలుగైదు ‘ఉత్తమ’ పురస్కారాల కోసం ఈ చిత్రం నామినేట్‌ కావడంతో అందరికీ తెలిసింది. ఇక ఈ చిత్రంలో నటించిన సీనియర్‌ నటులు ఇప్పటికే పరిచయమున్నా... ఓ బుల్లినటుడు మాత్రం ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన తర్వాత ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆ కుర్రాడే సన్నీ పవార్‌.

సినిమా కథలో భాగంగా కథానాయకుడి చిన్నప్పటి పాత్రను పోషించింది సన్నీ పవారే. నిన్నమొన్నటిదాకా ఓ స్వీపర్‌ కొడుకు. ఎప్పుడైతే ఆస్కార్‌ వేదిక మీద.. హాలీవుడ్‌ నటీనటుల ఒళ్లో తళుక్కున మెరిశాడో.. అప్పటి నుంచి అతడి రాత మారిపోయింది. అంతెందుకు మొన్నటిదాకా మురికివాడలో మిగతా కుర్రాళ్లతో ఆడిపాడిన సన్నీ.. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. లాస్‌ ఏంజిలెస్‌ నుంచి బుధవారం ముంబైకి తిరిగి వచ్చాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అలా కాలుపెట్టాడో లేదో... భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలతో వెల్‌కమ్‌ పలికారు. శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే ఈ కుర్రాడిని స్వయంగా అభినందించారు.

ఇక వెనక్కు తిరిగి చూడక్కరలేదేమో..
నిన్నమొన్నటి దాకా స్వీపర్‌గా పనిచేసిన సన్నీ తండ్రి.. ఇప్పుడు కొడుకుకే బిజినెస్‌ మేనేజర్‌గా మారిపోయాడు. కొడుకుతో కలిసి ట్రాలీలో ఓ పక్కన కూర్చున్న తండ్రి దిలీప్‌ పవార్‌కు కూడా సాదర స్వాగతం లభించింది. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అని అడిగితే... ‘అంతా ఆస్కార్‌ పుణ్యమే. అవార్డు రాకపోయినా మా వాడికి గొప్ప జీవితం బహుమతిగా వచ్చింది. ఇక వాడితోసహా మేమంతా వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేదేమో’నని చెప్పాడు.     
–సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement