breaking news
Oscar awards 2017
-
ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ.. తొలిసారి ఘనత సాధించిన దేశంగా!
సినిమా రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు తమ చిత్రం ఎంపికైందని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ట్వీట్ చేశారు. పాపా బుకా అనే చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించారని పోస్ట్ చేశారు. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఇండియా నుంచి భాగం కావడం మా నీల ప్రొడక్షన్స్‌కు లభించిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ మూవీ పుపువా న్యూ గినియా దేశం నుంచి అధికారిక ఎంట్రీని దక్కించుకుంది. దీంతో తొలిసారి ఆస్కార్ ఎంట్రీ ఘనతను ఆ దేశం సొంతం చేసుకుంది. పా రంజిత్ తన ట్వీట్లో రాస్తూ.. 'అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా..రెండు దేశాల సహ-నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి మద్దతుగా, అలాగే ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమిది. ఈ సినిమా ద్వారా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకు గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు డాక్టర్ బిజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పపువా న్యూగినియాకు చెందిన నోయెలీన్ తౌలా వునమ్, ఇండియాకు చెందిన అక్షయ్ కుమార్ పరిజా, పా రంజిత్, ప్రకాష్ బేర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న పపువా న్యూ గినియా దేశంలోని థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శించనున్నారు. డైరెక్టర్ బిజు ఇప్పటికే సైరా, వీట్టిలెక్కుల్ల వాజి, పెరారియథావర్, వేయిల్మరంగల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత, ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయి.It is a proud moment for me to state that Papa Buka has been officially selected as Papua New Guinea’s entry for the 98th Academy Awards in the International Feature Film category. As one of the producer from India, it has been an honour for Neelam Productions to be part of this… pic.twitter.com/3aEkSFP1DM— pa.ranjith (@beemji) August 27, 2025 -
అంతా ఆస్కార్ పుణ్యమే..
ఒక్కోసారి టైమే జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అప్పటిదాకా పరిచయంలేని కొత్త లోకాన్ని చూపిస్తుంది. అందలాలు ఎక్కిస్తుంది. ముంబై కుర్రాడు సన్నీ పవార్‌కు ఇప్పుడు అలాంటి టైమే కలిసొచ్చింది. ఇంతకీ సన్నీ పవార్ ఎవరో చెప్పుకోవాలి కదూ..! అయితే ఆ వివరాలు చదవండి... ‘లయన్’ సినిమా గుర్తుందా..? మధ్యప్రదేశ్‌లో కొన్నేళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనను హాలీవుడ్ సాంకేతికతతో, భారతీయ నటులతో తెరకెక్కించిన చిత్రం. విడుదలై.. మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయితే మొన్న జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నాలుగైదు ‘ఉత్తమ’ పురస్కారాల కోసం ఈ చిత్రం నామినేట్ కావడంతో అందరికీ తెలిసింది. ఇక ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులు ఇప్పటికే పరిచయమున్నా... ఓ బుల్లినటుడు మాత్రం ఆస్కార్ వేదిక మీద మెరిసిన తర్వాత ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆ కుర్రాడే సన్నీ పవార్. సినిమా కథలో భాగంగా కథానాయకుడి చిన్నప్పటి పాత్రను పోషించింది సన్నీ పవారే. నిన్నమొన్నటిదాకా ఓ స్వీపర్ కొడుకు. ఎప్పుడైతే ఆస్కార్ వేదిక మీద.. హాలీవుడ్ నటీనటుల ఒళ్లో తళుక్కున మెరిశాడో.. అప్పటి నుంచి అతడి రాత మారిపోయింది. అంతెందుకు మొన్నటిదాకా మురికివాడలో మిగతా కుర్రాళ్లతో ఆడిపాడిన సన్నీ.. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. లాస్ ఏంజిలెస్ నుంచి బుధవారం ముంబైకి తిరిగి వచ్చాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అలా కాలుపెట్టాడో లేదో... భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలతో వెల్కమ్ పలికారు. శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే ఈ కుర్రాడిని స్వయంగా అభినందించారు. ఇక వెనక్కు తిరిగి చూడక్కరలేదేమో.. నిన్నమొన్నటి దాకా స్వీపర్‌గా పనిచేసిన సన్నీ తండ్రి.. ఇప్పుడు కొడుకుకే బిజినెస్ మేనేజర్‌గా మారిపోయాడు. కొడుకుతో కలిసి ట్రాలీలో ఓ పక్కన కూర్చున్న తండ్రి దిలీప్ పవార్‌కు కూడా సాదర స్వాగతం లభించింది. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అని అడిగితే... ‘అంతా ఆస్కార్ పుణ్యమే. అవార్డు రాకపోయినా మా వాడికి గొప్ప జీవితం బహుమతిగా వచ్చింది. ఇక వాడితోసహా మేమంతా వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేదేమో’నని చెప్పాడు. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ట్రంప్‌పై కోపం: ఆస్కార్ విజేత బాయ్‌కాట్
తాను తీసిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే జీవితంలో అంతకంటే పెద్ద పండగ ఏమీ ఉండదు. అందులోనూ ఇంగ్లీషు సినిమా కాకుండా, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బహుమతి పొందాలంటే దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలతో పోటీ పడాలి. కానీ అలాంటి బహుమతి వచ్చినా కూడా తనకు అక్కర్లేదంటూ ఓ దర్శకుడు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను బహిష్కరించారు. అందుకు కారణం ఎవరో తెలుసా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 'ద సేల్స్‌మన్' అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు పొందిన ఇరానీ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ముస్లిం దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌ను నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ట్రంప్ విధానాలతో అగౌరవపడిన ప్రజలకు సంఘీభావంగా తాను ఆస్కార్ ఫంక్షన్‌కు దూరంగా ఉంటున్నట్లు తన పేరుతో పంపిన ప్రకటనతో ఫర్హాదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని అమెరికా, దాని శత్రువులుగా విభజించడం ద్వారా మిగిలిన దేశాలకు ఒకరకమైన భయం కలిగించారని, ఇది యుద్ధ కాంక్షతో కూడిన దాడిలాంటిదేనని ఆయన అన్నారు. ఫర్హాదీ పంపిన సందేశాన్ని ఇరాన్లో పుట్టి, అమెరికాలో ఇంజనీర్, వ్యోమగామి అయిన అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కులను హరిస్తాయని కూడా ఫర్హాదీ అన్నారు. కాగా, అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆయన 2011 సంవత్సరంలో 'ఎ సెపరేషన్' అనే సినిమాకు కూడా అవార్డు పొందారు. పెళ్లయిన దంపతులలో భార్య మీద అపార్టుమెంటులో దాడి జరిగిన తర్వాత వాళ్లిద్దరూ ప్రశాంతమైన జీవితం, న్యాయం కోసం చేసే పోరాటమే 'ద సేల్స్‌మన్' చిత్రం ఇతివృత్తం.