breaking news
lion movie
-
అంతా ఆస్కార్ పుణ్యమే..
ఒక్కోసారి టైమే జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అప్పటిదాకా పరిచయంలేని కొత్త లోకాన్ని చూపిస్తుంది. అందలాలు ఎక్కిస్తుంది. ముంబై కుర్రాడు సన్నీ పవార్‌కు ఇప్పుడు అలాంటి టైమే కలిసొచ్చింది. ఇంతకీ సన్నీ పవార్ ఎవరో చెప్పుకోవాలి కదూ..! అయితే ఆ వివరాలు చదవండి... ‘లయన్’ సినిమా గుర్తుందా..? మధ్యప్రదేశ్‌లో కొన్నేళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనను హాలీవుడ్ సాంకేతికతతో, భారతీయ నటులతో తెరకెక్కించిన చిత్రం. విడుదలై.. మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయితే మొన్న జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నాలుగైదు ‘ఉత్తమ’ పురస్కారాల కోసం ఈ చిత్రం నామినేట్ కావడంతో అందరికీ తెలిసింది. ఇక ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటులు ఇప్పటికే పరిచయమున్నా... ఓ బుల్లినటుడు మాత్రం ఆస్కార్ వేదిక మీద మెరిసిన తర్వాత ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆ కుర్రాడే సన్నీ పవార్. సినిమా కథలో భాగంగా కథానాయకుడి చిన్నప్పటి పాత్రను పోషించింది సన్నీ పవారే. నిన్నమొన్నటిదాకా ఓ స్వీపర్ కొడుకు. ఎప్పుడైతే ఆస్కార్ వేదిక మీద.. హాలీవుడ్ నటీనటుల ఒళ్లో తళుక్కున మెరిశాడో.. అప్పటి నుంచి అతడి రాత మారిపోయింది. అంతెందుకు మొన్నటిదాకా మురికివాడలో మిగతా కుర్రాళ్లతో ఆడిపాడిన సన్నీ.. ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. లాస్ ఏంజిలెస్ నుంచి బుధవారం ముంబైకి తిరిగి వచ్చాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అలా కాలుపెట్టాడో లేదో... భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలతో వెల్కమ్ పలికారు. శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే ఈ కుర్రాడిని స్వయంగా అభినందించారు. ఇక వెనక్కు తిరిగి చూడక్కరలేదేమో.. నిన్నమొన్నటి దాకా స్వీపర్‌గా పనిచేసిన సన్నీ తండ్రి.. ఇప్పుడు కొడుకుకే బిజినెస్ మేనేజర్‌గా మారిపోయాడు. కొడుకుతో కలిసి ట్రాలీలో ఓ పక్కన కూర్చున్న తండ్రి దిలీప్ పవార్‌కు కూడా సాదర స్వాగతం లభించింది. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? అని అడిగితే... ‘అంతా ఆస్కార్ పుణ్యమే. అవార్డు రాకపోయినా మా వాడికి గొప్ప జీవితం బహుమతిగా వచ్చింది. ఇక వాడితోసహా మేమంతా వెనక్కి తిరిగి చూసుకోనక్కరలేదేమో’నని చెప్పాడు. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఈ నెలాఖరున రానున్న 'లయన్'
హైదరాబాద్: నందమూరి అభిమానుల ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'లయన్' ఈ నెలాఖరున విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను వేసవి స్పెషల్ గా ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'లెజెండ్' హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన తొలిసారిగా త్రిష నటించింది. రాధికా ఆప్టే మరో హీరోయిన్ గా చేసింది. బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న ఈ చిత్రం అభిమానులను అలరిస్తుందని దర్శకుడు సత్యదేవ్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. -
బాలకృష్ణ వాడుతున్న కారు చోరీ
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమా షూటింగ్ లో కారు చోరీకి గురైంది. షూటింగ్ కోసం ఆయన వాడుతున్న కారును ఎత్తుకెళ్లారంటూ హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్నారు.