ముంబైలో ఆటా పాటా | Sunny Leone's Son in Rajasekhar Garuda Vega | Sakshi
Sakshi News home page

ముంబైలో ఆటా పాటా

Apr 6 2017 11:51 PM | Updated on Sep 5 2017 8:07 AM

ముంబైలో ఆటా పాటా

ముంబైలో ఆటా పాటా

పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలంటే యాంగ్రీ మేన్‌ రాజశేఖర్‌కు కొట్టిన పిండే. ‘అంకుశం, ఆగ్రహం, మగాడు’ వంటి చిత్రాల్లో ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకులను అలరించారాయన.

పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలంటే యాంగ్రీ మేన్‌ రాజశేఖర్‌కు కొట్టిన పిండే. ‘అంకుశం, ఆగ్రహం, మగాడు’ వంటి చిత్రాల్లో ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకులను అలరించారాయన. తాజాగా ‘గరుడ వేగ’ చిత్రంలో మరోసారి రాజశేఖర్‌ టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నట విశ్వరూపం చూపించనున్నారు. ఇందులో ఆయన సై్టలిష్‌గా కనిపించనున్నారు. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్‌’ చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

కాగా, మనోజ్‌ హీరోగా రూపొందిన ‘కరెంటు తీగ’లో నటించిన సన్నీ లియోన్‌ ‘గరుడ వేగ’లో ఓ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం భారీ సెట్‌ వేశారు. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విష్ణుదేవా ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement